మునగ ఆకులు తింటే కలిగే టాప్ 8 లాభాలివీ..!
మునగాకు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో విటమిన్-ఎ, సి, ఇ ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.
ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఐసోథియో సైనేట్స్ అనే సమ్మేళనాలు మునగాకులో ఉంటాయి. ఈ బయోయాక్టీవ్ సమ్మేళనాలు శరీరలో నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మునగాకులోని బీటా-సిటోస్టెరాల్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది హృదయనాళ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు నెరవడాన్ని ఆపుతుంది.
మచ్చలు, మొటిమలు, ముడుతలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.