పంచదారకు బదులు బెల్లం వేసి టీ తయారుచేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. అయితే బెల్లం టీ గురించి చాలామందికి తెలియని నిజాలివీ..
బెల్లం టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధకశక్తి పెంచుతాయి.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివారించవచ్చు.
బెల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పంచదారకు బదులు బెల్లం వాడితే టీ రుచి మాత్రమే కాదు. ఇది సహజమైన తీపితో రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల చేస్తుంది. ఇది రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది.
బెల్లం టీ లో వేడెక్కించే గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సంబంధ సమస్యలను, శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.
బెల్లంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం చూపిస్తుంది. షుగర్ ను నియంత్రిస్తుంది.
శరీరాన్ని, కాలేయాన్ని శుద్ది చేయడంలో కూడా బెల్లం టీ సహాయపడుతుంది. రోజూ ఓ కప్పు బెల్లం టీ తాగితే శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి.
బెల్లంలో, టీ కోసం ఉపయోగించే పాలలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి.