కొలస్ట్రాల్ సమస్య.. వీటిని తాగితే మీ రక్త నాళాలు క్లీన్ అవుతాయి.. 

ఉదయం సమయంలో ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం వంటి సమస్యలు ఉంటే ఒకసారి కొలస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి. 

శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మీ రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. పరగడుపునే కొన్ని జ్యూస్‌లు తాగడం వల్ల మీ రక్తనాళాలు క్లీన్ అవుతాయి. 

మీ రోజును నిమ్మకాయ నీళ్లతో ప్రారంభించండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కాలేయంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. మెటబాలిజమ్‌ను పెంచుతుంది. కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

యాంటీ-ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ జ్యూస్ కొలస్ట్రాల్ స్థాయులను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

నైట్రేట్స్‌తో నిండిన బీట్‌రూట్ జ్యూస్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరిచి డీటాక్సిఫికేషన్ చేస్తుంది. 

గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగితే మీ శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గుతాయి. పోషకాల శోషణ పెరుగుతుంది. 

ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో గ్రీన్ టీ ప్రభావవంతంగా పని చేస్తుంది. వీటిలోని కెటాచిన్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి.