తెలిసీ, తెలీక రోజూ మనం చేసే కొన్ని పనుల వల్ల శరీరంలో శక్తి మొత్తం హరిస్తుంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీహైడ్రేషన్ వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. అందుకే తగినంత నీరు తాగుతూ ఉండాలి.

అధిక మానసిక ఒత్తిడి మీ శరీరంలో శక్తిని హరిస్తుంది. దీన్ని నివారించేందుకు రోజూ యోగా చేయాలి.

పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం లేకపోవడం వల్ల కూడా శరీరం అలసటకు గురవుతుంది.

తక్కువగా నిద్రపోవడం వల్ల ఆ రోజు మొత్తం శరీరం అలసటగా ఉంటుంది.

రాత్రిళ్లు కనీసం 7నుంచి 8గంటల పాటు నిద్ర అవసరం.