ఈ ఫుడ్స్ తీసుకుంటే.. లివర్‌కి మంచిది కాదు
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ‘లివర్’ శరీరంలో ఎన్నో పనులు చేస్తుంది. అలాంటి లివర్‌ని కాపాడుకోవడానికి ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
షుగర్ డ్రింక్స్: వీటిల్లో ఫ్రెక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వుగా మారి, లివర్‌లో పేరుకుపోయి, ఫ్యాటీ లివర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
ప్యాక్డ్ ఫుడ్స్: స్నాక్స్, చిప్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్‌లో రిఫైన్డ్ షుగర్స్, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ సంబంధిత సమస్యల్ని పెంచుతాయి.
రెడ్ మీట్: రెడ్‌మీట్, ప్రాసెస్ చేసిన మీట్‌లో హానికర ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే.. లివర్ సమస్యల ముప్పు పెరుగుతుంది.
ఉప్పు ఉండే ఆహారాలు: ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తింటే.. రక్తపోటు పెరిగి, శరీరంలో ద్రవం నిలుస్తుంది. ఈ రెండూ లివర్‌ని దెబ్బతీస్తాయి.
రిఫైన్డ్ ఫుడ్స్: వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఫుడ్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, లివర్ సమస్యలను పెంచుతుంది.
కృత్రిమ స్వీటెనర్స్: ఇవి లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. లివర్ పనితీరును ప్రభావితం చేసి, జీవక్రియ ఆటంకాలకు దారితీస్తుంది.
హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్: వీటిల్లో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి లివర్ వాపుకు కారణమై, లివర్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
Related Web Stories
పుచ్చకాయ గింజలను తింటే?
ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల వేసవిలో తక్కువ కేలరీలు అందుతాయట..!
వేపుడు పదార్థాలు తింటే అనర్థాలు ఇవే!
మెదడుకు ఇలా పదును పెట్టుకోండి..