వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

వాల్నట్స్ లో ఒమోగా-3 ఫ్యాటీ యాసిడ్లు , ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడతాయి.

బాదం పప్పులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్-ఇ, సెలీనియం,  వంటి యాంటీ ఆక్సిడెంట్లు,  ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.  ఇవి స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయి.

బ్రెజిల్ నట్స్ స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు,  ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇందులో సెలీనియం ఉంటుంది.  స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

టమోటాలలో లైకోపీన్ ఉంటుంది.  ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది.  రోజుకు రెండు మూడు టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జును ఆహారంలో తీసుకుంటే మంచిది.

స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సముద్రపు ఆహారాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఆకుపచ్చ కూరగాయలలో  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి స్పెర్మ్ సెల్యులార్ దెబ్బతినకుండా నిరోధించి దాని కదలికను చురుగ్గా ఉంచుతాయి.

గుమ్మడి గింజలలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే పైటోస్టెరాల్ ఉంటుంది.  ఈ మగ హార్మోన్ పెరుగుదల వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.

సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఉంటుంది. ఇది  స్పెర్మ్ కదలికను  మెరుగ్గా ఉంచుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తుంది.