ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..

పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ  పండ్లలో సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.

కొన్ని రకాల పండ్లు మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

అవకాడోలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.  ఇవి రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతాయి.

నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  రక్తంలో అధిక చక్కెరను నియంత్రిస్తుంది.

యాపిల్స్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

పీచ్ పండ్లలో విటమిన్-సి,  విటమిన్-ఎ,  విటమిన్-కె, విటమిన్-ఇ, మినరల్స్,  ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి.

ప్లమ్స్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇవి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడానికి మెరుగ్గా ఉంటాయి.

ద్రాక్ష పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు  ఉంటాయి.  ఇవి  రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతాయి.