ఈ పండ్లను ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టొద్దు.. లేకపోతే!
మార్కెట్‌లో పండ్లు కొన్న వెంటనే వాటిని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే.. కొన్ని పండ్లని అలా పెట్టొద్దని నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే..
జామపండ్లు: ఈ పండ్లు చలిని తట్టుకోలేవు. చలిలో పెడితే నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో రుచి పాడవుతుంది. కాబట్టి.. ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు.
పనస: ఇది సమ్మర్ సీజనల్ ఫ్రూట్. ఇవి ఎండల్లోనే మంచిగా పండుతాయి. కానీ.. ఫ్రిడ్జ్‌లో ఉంచితే మాత్రం వీటి టేస్ట్ పూర్తిగా మారిపోతుంది.
అరటిపండ్లు: వీటిని ఫ్రిడ్జ్‌లో ఉంచితే.. కుళ్ళిపోయినట్లుగా అవుతాయి. కాబట్టి.. కాస్తా పక్వానికి రాగానే, రూమ్ టెంపరేచర్‌లో ఉంచడం బెటర్.
మామిడిపండ్లు: వీటిని ఫ్రిడ్జ్‌లో పెడితే రుచి పోతుంది. కాబట్టి, గాలి తగిలే ఓ కంటెయినర్‌లో పెట్టి, చీకటి ప్రదేశంలో ఉంచితే చాలా ఉత్తమం.
పుచ్చకాయ: దీన్ని ఫ్రిడ్జ్‌లో పెడితే.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు కానీ, ఎక్కువసేపు పెట్టకూడదు.
లిట్చి: దీన్ని ఫ్రిడ్జ్‌లో పెడితే.. పైభాగం బాగానే ఉంటుంది కానీ, లోపలి గుజ్జు పాడైపోతుంది. కాబట్టి.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు.
యాపిల్: వీటిని ఫ్రిడ్జ్‌లో ఉంచితే.. వాటిల్లో ఉండే క్రియాశీల ఎంజైమ్‌ల కారణంగా అవి త్వరగా పండుతాయి. కాగితంలో చుట్టి ఉంచితే బెటర్.
Related Web Stories
ఆరోగ్యకరమైన ఆఫీస్ టిఫిస్స్ ఇవే.. ఈ స్నాక్స్‌కి నూనె అవసరం లేదు..!
తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!
పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!
ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మాయం