ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!
చైనా, జపాన్, కొరియా ప్రాంతాలలో లభించే యుజ అనే సిట్రస్ పండుతో సిట్రాన్ టీ చేస్తారు. ఇది జీర్ణక్రియలో సహాయపడి బరువు ఈజీగా తగ్గిస్తుంది.
కీరా దోసకాయ, పుదీనా కలిపిన నీరు మంచి డిటాక్స్ గా పనిచేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ బరువు మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. దీన్ని తేనె, నిమ్మరసంతో తీసుకుంటే జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు.
నీటిలో అల్లం, నిమ్మరసం వేసి తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఉబ్బరం తగ్గుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
బార్లీ టీని బోరిచా టీ అని కూడా అంటారు. ఇందులో కెఫిన్ ఉండదు. కేలరీలు తక్కువ. బరువు తగ్గడానికి బెస్ట్ గా సహాయపడుతుంది.
కొరియన్లు తాగే రెడ్ జిన్సెంగ్ టీ కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. బరువ తగ్గించడంలో సహాయపడుతుంది.
హనీ సిట్రాన్ టీ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సిట్రాన్ ప్రభావం తేనెతో కలి్స్తే మరింత శక్తివంతమవుతుంది.
మచ్చా లట్టే చూడటానికి ఆకుపచ్చని పొడిలా ఉంటుంది. రుచికి గడ్డిలా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.