జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!

రోజూ పాటించే కొన్ని ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.

క్రమం తప్పకుండా సోడా పానీయాలు తాగేవారికి బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం,  టైప్-2  డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ప్రాసెస్ చేసిన మాంసాలలో  కొవ్వులు, సోడియం ఎక్కువ. సంతృప్త కొవ్వులు,  నైట్రేట్ లు ఉంటాయి.  ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

పాలిష్ చేసిన బియ్యం, పాస్తా, బ్రెడ్ మొదలైనవాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను,  కొలెస్ట్రాల్ ను నియంత్రించలేవు. గుండె జబ్బులకు కారణమవుతాయి.

బంగాళాదుంప చిప్స్ లో ఉండే అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్  రక్తపోటు పెంచి గుండె పై అదనపు ఒత్తిడి కలిగిస్తాయి.

ఐస్ క్రీం లో సంతృప్త కొవ్వులు ఎక్కువ. ఇవి గుండె ఆరోగ్యానికి  హానికరం. ఇవి బరువు పెరగడం,  ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణం అవుతాయి.

నిలబడి తినే అలవాటు పేలవమైన జీర్ణక్రియకు, అతిగా తినడానికి దారి తీస్తుంది. ఇది గుండెకు ముప్పు తెస్తుంది.

అతి వేగంగా, త్వరగా తినడం  గుండెకు ప్రమాదకరం. వేగంగా తినేవారు అతిగా తినేస్తుంటారు. ఇది బరువు పెరగడానికి,  ఊబకాయానికి,  గుండె జబ్బులకు దారితీస్తుంది.