మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..

శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా,  కండరాలు బలంగా ఉన్నా ప్రోటీన్ చాలా అవసరం.

చాలామంది ప్రోటీన్ మాంసాహారంలోనే ఉంటుందని అనుకుంటారు.

కానీ కొన్ని నట్స్ లో మాంసాహారాన్ని మించి ప్రోటీన్ ఉంటుంది. 

బాదం బాదం పప్పులో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చు.

పిస్తా.. పిస్తా పప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికం.  విటమిన్-బి6 మెరుగ్గా  ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి మానసిక స్థితికి మంచివి.

వేరుశనగ.. వేరుశనగలలో  ఫైబర్, ఫోలెట్, మెగ్నీషియం,  నియాసిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.  కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు సహాయపడతాయి.

జీడిపప్పు.. జీడిపప్పులో ఉండే ప్రోటీన్ ఎముకల ఆరోగ్యానికి,  రోగనిరోధక శక్తికి మంచిది.  కాపర్, మెగ్నీషియం,  మాంగనీస్, లుటిన్ మొదలైనవి ఉంటాయి.

వాల్నట్.. వాల్నట్స్ లో ప్రోటీన్లు,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు  ఉంటాయి.  ఇవి మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతాయి.

తామర విత్తనాలు.. తామర విత్తనాలలో ప్రోటీన్ అధికం. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా ఎక్కువగా ఉంటుంది.

పైన్ నట్స్.. హిమాలయ ప్రాంతంలో కనిపించే పైన్ చెట్ల నుండి వీటిని సేకరిస్తారు.  ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.