పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..

పెసర మొలకలు చాలా మంచి ప్రోటీన్ ఆహారంగా పరిగణిస్తారు. 

పెసర మొలకలు శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ కొందరికి తీవ్రమైన హాని చేస్తాయి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు పెసర మొలకలకు దూరంగా ఉండాలి.

మొలకలు లేదా పెసల అలర్జీ ఉన్నవారు పెసర మొలకలు తినకూడదు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి.  అలాగే పెసర మొలకలకు కూడా దూరం ఉండాలి.

గర్భవతులు పచ్చి పెసర మొలకలకు దూరం ఉండాలి.  మొలకలలో బ్యాక్టీరియా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు పచ్చి మొలకలు తినకూడదు.  

ఎవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మొలకలు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.