ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!
ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంది.
అయితే వాల్నట్స్ అందరికీ మంచిది కాదు.. కొన్ని సమస్యలు ఉన్నవారికి వాల్నట్స్ హాని చేస్తాయి.
అలెర్జీలు ఉన్నవారు వాల్నట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇది దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలిగిస్తుంది.
వాల్నట్స్ లో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారికి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.
వాల్నట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.
వాల్నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి.
వాల్నట్స్ లో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండ సమస్యలు ఉన్నవారు వీటిని మితంగా తినాలి.
వాల్నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పై దద్దుర్లు, చర్మ సంబంధ సమస్యలు రావచ్చు. ఇలాంటి వారు వాల్నట్స్ కు దూరం ఉండాలి.