ఈ సమస్యలు ఉన్నవారు బాదం తింటే డేంజర్..!

బాదంపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

బాదం పప్పులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,  ఫైబర్, విటమిన్-ఇ వంటి పోషకాలు ఉంటాయి.  

కొంతమంది బాదంపప్పు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుంది.

అలర్జీ సమస్యలు ఉన్న వ్యక్తులు బాదం పప్పు తినకూడదు. ఇది అలెర్జీలను పెంచుతుంది.

బాదం పప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొందరికి పొట్ట సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి పొట్టలో పుండ్లు వస్తాయి.

చిన్న పిల్లలు బాదం పప్పును సరిగా నమలలేరు.  మింగడంలోనూ,ఆ తరువాత జీర్ణం కావడంలోనూ ఇబ్బంది ఏర్పడుతుంది.  

బాదం పప్పులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం తీసుకోవడం తగ్గించాలి.

బాదం పప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నా అందులో ఉన్న అధిక కేలరీలు బరువు తగ్గడాన్ని అడ్డుకుంటాయి.