రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

ఇప్పటికాలం జీవనశైలి,  కలుషిత ఆహారం వల్ల శరీరంలో రక్తంలో టాక్సిన్లు పేరుకుపోతుంటాయి.  వీటిని బయటకు పంపాలంటే  రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్  తీసుకోవాలి.

వెల్లుల్లి.. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.  ఇవి కాలేయం రక్తాన్ని శుద్ది చేయడంలో సహాయపడతాయి.

పసుపు.. పసుపులో ఉండే కర్కుమిన్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  ఇవి కాలేయం సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడతాయి.

బీట్ రూట్.. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.  ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.

కొత్తిమీర.. కొత్తమీర రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన టాక్సిన్లను కూడా సమర్థవంతంగా తొలగించగలుగుతుంది. శరీరం మొత్తాన్ని శుద్ది చేస్తుంది.

ఆకుకూరలు.. బచ్చలికూర, పాలకూర,  కాలే, మెంతికూర, తోటకూర,  పునర్నవి లేదా తెల్లగలిజేరు వంటి వాటిలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది.  ఇవి రక్తంలో టాక్సిన్లను  సమర్థవంతంగా తొలగిస్తాయి.

నిమ్మకాయ.. నిమ్మకాయలలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి కాలేయ పనితీరును పెంచడంలోనూ, రక్తాన్ని శుద్ది చేయడంలోనూ సహాయపడతాయి. 

 అల్లం.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  ఇవి కాలేయ పనితీరుకు తోడ్పడతాయి.  రక్తాన్ని శుభ్రం చేస్తాయి.