శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
దానిమ్మ.. దానిమ్మలో ఉండే రాగి, జింక్ వంటి ఖనిజాలు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.
క్యారెట్స్.. క్యారెట్లలో విటమిన్-A,C,B3, B6 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి.
పసుపు..
పసుపు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతుంది. శరీరంలో అన్ని అవయవాలకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది.
బెర్రీస్.. బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి.
నిమ్మకాయలు..
నిమ్మకాయలలో ఉండే విటమిన్-సి హిమోగ్లోబిన్ లో ఆక్సిజన్ క్యారియర్ లను అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది.
అవకాడో.. అవకాడోలో పొటాషియం, లుటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఆక్సిజన్ శోషణను మెరుగుపరిచి ఆక్సిజన్ సరఫరాను ప్రోత్సహిస్తుంది.
ఆకుకూరలు.. బచ్చలికూర, కాలే, స్విస్ చార్జ్ వంటి ఆకుకూరలలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
ద్రాక్ష.. శరీరానికి ఆక్సిజన్ ప్రవాహం పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి.
బాదం పప్పు.. బాదం పప్పులో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచే యాంటీఆక్సిడెంట్.
Related Web Stories
కిడ్నీ సమస్యలను దూరం చేసే హెల్దీ డ్రింక్స్
తామర పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
ఇలా చేస్తే వర్షాకాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు రావు!
గడ్డి చామంతితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!