జీరో కేలరీల ఆహారాలు బరువు తగ్గడానికి ప్రయత్నం చేసే వారికి బాగా సహాయపడతాయి. వీటిలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండటం మూలాన ఆరోగ్యం కూడా చేకూర్చుతాయి.
జీరో కేలరీ ఫుడ్స్ ను నెగటివ్ క్యాలరీ ఫుడ్స్ అని కూడా అంటారు. అంటే వీటిలో అస్సలు కేలరీలు ఉండవని కాదు, కానీ చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని జీర్ణం చేయడానికి శరీరం చాలా శక్తి ఖర్చు చేస్తుంది. తద్వారా బరువు తగ్గవచ్చు.
యాపిల్స్..యాపిల్స్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. పదే పదే తినాలనే కోరికను నియంత్రిస్తుంది.
క్యారెట్లు..క్యారెట్లలో బీటా-కెరోటిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధికంగా ఆకలి వేయడాన్ని నియంత్రిస్తాయి.
దోసకాయ..ఎక్కువ నీటి కంటెంట్ ఉన్న దోసకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. సలాడ్ లోనూ, నేరుగానూ వీటిని తినవచ్చు.
పుచ్చకాయ..పుచ్చకాయలో కూడా నీటిశాతం ఎక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్ రూట్..విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
ఆప్రికాట్..ఆప్రికాట్ లో కేలరీలు తక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
బ్రోకలీ..విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు బ్రోకలీలో సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది.