ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి  లాభమా? నష్టమా?

ఆలూ చిప్స్‌ తింటే.. అనారోగ్యం గ్యారంటీ అని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. 

వీటి తయారీలో నూనె, ఉప్పు అధికంగా వినియోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి బాగా పెరుగుతుంది. 

దీంతో గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. అలాగే శరీరంలో చెడు కొవ్వును సైతం పెంచుతుంది.

ఆలూ చిప్స్ అధికంగా తినే వ్యక్తులకు 28 శాతం అధికంగా గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. 

ఈ చిప్స్ అధికంగా తీసుకుంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.  

ఆలూ చీప్స్ జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. 

కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.  

ఇవి అధికంగా తీసుకోంటే.. రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశముంది.

ఈ చిప్స్ తినడం వల్ల శరీరం బరువు.. పెరుగుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు.. డీప్ ఫ్రై చేసిన చిప్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ల వద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.