d2aa7974-6e2e-4897-b3bb-edd4ac27d1df-fats.jpg

శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు ఇవే..!

950dfeb5-3556-458a-8279-9107995359f3-fats1.jpg

మెదడు పనితీరు,  గుండె ఆరోగ్యం,  పోషకాల శోషణకు ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.

dda6dd48-e53a-47fe-9d28-62c10f9045f2-fats2.jpg

మోనో అన్ శాచురేటెడ్,  ఒమేగా-3  ఫ్యాటీ యాసిడ్లు వాపును తగ్గించడంలో,  చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో,  పోషకాల శోషణను పెంచడంలో  సహాయపడతాయి.

an avocado cut in half on a plate

అవకాడో లో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఫైబర్, పొటాషియం,  విటమిన్ సి,  ఇ, కె లు కలిగి ఉంటాయి.

బాదం,  వాల్నట్, అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, ఫైబర్  ఉంటాయి.

ఎక్ట్స్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సాల్మన్,  మాకేరెల్, సార్టినెస్,  ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 70శాతం కోకో ఉన్న చాక్లెట్లు ఎంచుకోవాలి.

కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. వంట చేయడానికి,  బేక్ చేయడానికి కొబ్బరినూనె ఎంచుకుంటే మంచిది.

గుడ్లలోని పచ్చ సొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి.   మెదడు పనితీరుకు తోడ్పడే కోలిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా పెరుగులో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాల్షియం,  ప్రోటీన్ తో పాటూ ప్రోబయోటిక్స్ గా పనిచేస్తాయి.