గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?

ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో వివిధ అవయవాలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం.

ప్రోటీన్ ఎక్కువగా మాంసాహారం నుండి లభిస్తుందని అనుకుంటారు. కానీ గుడ్లు, చికెన్ కంటే మెరుగ్గా ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారం ఉంది.

శాకాహారులు పెసరపప్పు తింటే గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది.

100గ్రాముల పెసరపప్పులో 8గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

పెసరపప్పులో విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-ఇ తో పాటు ఐరన్, పొటాషియం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

కండరాలను బలంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ నానబెట్టిన పెసరపప్పు తినడం మంచిది.పెసర మొలకలు తింటే ఇంకా ప్రయోజనం.

పెసరపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

నానబెట్టిన పెసరపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నానబెట్టిన పెసరపప్పులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం ఉంటాయి.

బరువు తగ్గాలని అనుకునే వారు ప్రతిరోజూ పెసర మొలకలు లేదా పెసరపప్పు తింటే తొందరగా బరువు తగ్గుతారు.