కొలాన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

అప్పుడప్పుడూ కొలొనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే వ్యాధిని తొలి దశలోనే గుర్తించొచ్చు

పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారంతో కొలాన్ క్యాన్సర్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది

ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, చక్కెరలు అధికంగా ఉన్న డ్రింక్స్‌కు వీలైనంత వరకూ దూరంగా ఉండాలి

మద్యం స్వల్పంగా తీసుకున్నా ప్రమాదమే. ఆల్కహాల్‌తో క్యా్న్సర్ ముప్పు పెరుగుతుంది

ప్రాసెస్డ్, రెడ్ మీట్ కూడా కొలాన్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు లేదా బ్రిస్క్ వాకింగ్ చేయడం కూడా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది

ధూమపానం కూడా కొలాన్ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. కాబట్టి, ఈ దుర్వ్యసనాన్ని వదిలించుకోవాలి.