చాలా మందికి నడుం నొప్పి వదలకుండా వేధిస్తుంటుంది. ఇలాంటి వారు రోజూ కొన్ని చిట్కాలు పాటిస్తే నొప్పి క్రమంగా తగ్గిపోతుంది
కూర్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. భుజాలు, చేతులు కంఫర్టబుల్‌గా ఉంటే నడుంపై ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది
నడక, స్విమ్మింగ్ లాంటి సులభమైన ఎక్సర్‌సైజులతో కండరాల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అవి మరింతగా రిలాక్సైతే నడం నొప్పి తగ్గుతుంది.
రోజంతా ఆఫీసులో గడిపే వారికి కూర్చునేందుకు అనువైన కుర్చీలు చాలా కీలకం. మంచి ఎర్గోనామిక్ కుర్చీలతో నొప్పి తొలగుతుంది
జిమ్స్‌లో బరువులు ఎత్తేటప్పుడు నడుంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు మొదలవుతాయి
నొప్పి ఉన్న భాగంలో ఐస్ లేదా గోరువెచ్చని నీరు తగిలేలా చూస్తే కండరాలు రిలాక్సై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కసరత్తులు చేసేవారు స్ట్రెచ్చింగ్ ఎక్సర్‌సైజులు కూడా తమ దైనందిన విధానంలో భాగం చేస్తే నడుం కండరాల శక్తి పెరిగి నొప్పి తగ్గుతుంది
నడుం నొప్పితో బాధపడుతున్న వారు మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండే పరుపునకు బదులు మధ్యస్థంగా ఉన్నది ఎంచుకోవాలి
రోజూ తగినంత నీరు తాగడం వెన్నుపూస ఆరోగ్యానికి ఎంతో కీలకం
డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ స్ట్రెస్ తగ్గించుకుంటే నడుం నొప్పి కూడా తొలగిపోతుంది