పెదవులు అందంగా, మృదువుగా మారాలంటే..!
పెదవులు పగలడం, పొడిబారడం సమస్య శరీర తత్వాన్ని బట్టి అన్ని కాలాల్లోనూ ఉంటుంది ఇది తగ్గాలంటే..
ఇంట్లో ఉపయోగించే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
బాదం పలుకుల మిశ్రమాన్ని పెదవులపైన రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెదవులు కాంతి వంతం
గా మారతాయి.
తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులుకు పూసినా పెదవులు మృదు
వుగా మెరుస్తాయి.
ఆలివ్ ఆయిల్, చక్కెర కలిపిన మిశ్రమాన్ని పెదవులకు పూసినా మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్ పెదవులకు పూసి కాసేపు అయ్యాకా గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది కూడా పె
దవులు పగుళ్ళను తగ్గి, అందం పెరుగుతుంది.
దానిమ్మ జ్యూస్ పెదవులకు పూసి కొద్దిసేపటి తర్వాత గడిగేయాలి ఇది పెదవుల పగుళ్ళను తగ్గిస్తుంది. మృదువుగా మారుస్తుంది.
గులాబీ రేకుల మిశ్రమాన్ని పాలలో కలిపి పెదవులకు పట్టించి కాసేపు ఉంచి కడిగేయాలి. ఇది పెదవులకు నిగారింపునిస్తుంది.
పెదవులు తేమగా ఉండాలంటే రాత్రి నిదురించే సమయంలో కొబ్బరి నూనెపూసి , ఉదయాన్నే క్లిన్ చేయాలి.
Related Web Stories
భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!
పచ్చి మిరపను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
సైకిల్ తొక్కితే ఇన్నీ ఆరోగ్య ప్రయోజనాలా..!
మొలకలొచ్చిన వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!