Toothpick: టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?
టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
సాధారణంగా ఆహారం దంతాల మధ్య ఇరుక్కుపోతే.. టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం. అయితే తరచూ ఇలా చేయడం వల్ల.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయిని అంటున్నారు
సాధారణంగా ఆహారం దంతాల మధ్య ఇరుక్కుపోతే.. మనం టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాం.
అయితే తరచూ ఇలా చేయడం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. మనకు తెలియకుండానే చిగుళ్ళు గాయపడి.. వాటి నుంచి రక్తస్రావం జరుగుతుంది.
దీని వల్ల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపించి ప్రమాదాన్ని ఉందని హెచ్చరిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం రూట్ కెనాల్స్ ట్రిట్మెంట్ చేయించుకున్న వారు.. దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పిక్స్ అసలు ఉపయోగించకూడదు. దీనివల్ల దంత సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి.
దంతాలలో ఆహారం ఇరుక్కుపోతే..వాటిని గోరు వెచ్చని నీటితో బాగా పుక్కిలించి..శుభ్రం చేసుకోవాలి.
ఇలా దంతాలను శుభ్రపరచడం వల్ల నోటిలో బ్యాక్టీరియా సమస్య సైతం పరిష్కారమవుతుంది.
లేకుంటే తేలికగా బ్రష్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారం తేలిగ్గా శుభ్రమవుతోంది.