లాలిపాప్స్ ద్వారా క్యాన్సర్ గుర్తింపు..ఎలాగంటే

ఇకపై ప్రారంభ దశలోనే నోటి కాన్సర్‌ను గుర్తించేందుకు యూకే శాస్త్రవేత్తలు సువాసన గల లాలీపాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు

ఇప్పటిదాకా నోటి కాన్సర్‌ను గుర్తించటానికి చేసే పరీక్షలు కాస్త నొప్పితో కూడుకున్నవిగా ఉండేవి

కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెడుతున్న ఈ లాలీపాప్స్‌ వల్ల రోగ నిర్ధారణ మరింత సులభం కానుంది

బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ లాలీపాప్స్‌ స్మార్ట్‌ హైడ్రోజెల్‌తో తయారు చేస్తారు

లాలాజల నమూనాలను హైడ్రోజెల్‌లోకి బదిలీ చేయటానికి రోగులు వాటిని పీల్చాల్చి ఉంటుంది

హైడ్రోజెల్‌ ఒక విధమైన మాలిక్యులర్‌ నెట్‌గా పనిచేస్తుంది

లాలాజలం, ప్రొటీన్లను అది గ్రహిస్తుంది

ఆ క్రమంలో హైడ్రోజెల్‌కు అతుక్కున్న ప్రొటీన్లను విశ్లేషించటం ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు

నోటి కాన్సర్‌ను నిర్ధారించటానికి స్మార్ట్‌ హైడ్రోజెల్స్‌ ఎంతో ఉత్తేజకరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది

లాలాజలంలోని ప్రొటీన్‌ను ఇవి సులభంగా గ్రహిస్తాయని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రుచి గుప్తా తెలిపారు

ఈ ప్రాజెక్టు తదుపరి దశను త్వరలో ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లడించారు