బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!
బెండకాయలలో ఉండే ఫైబర్, పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మధుమేహం ఉన్నవారికి చాలా మంచివి.
ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.
బెండకాయలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలోనూ, వయసు వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
బెండకాయలలో యాంటీఆక్సిడెంట్లు హనికరమైన ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించి, డిఎన్ఎ కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా కలిగి ఉంటాయి.
అధికంగా ఫైబర్ ఉండటం వల్ల శరీరం కొలస్ట్రాల్ గ్రహించడాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బెండకాయలలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలో జెల్ లాగా ఏర్పడి జీర్ణాశయాన్ని, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.
విటమిన్-సి, కాల్షియం, మెగ్నీషియం వంటివన్నీ బెండకాయలో ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి,బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడతాయి,
బెండకాయలలో ఉండే విటమిన్-సి ఇన్ఫెక్షన్లను, జబ్బులను దూరం చేస్తుంది.
బెండకాయలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపులు, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గించండలో సహాయపడతాయి.