శీతాకాలంలో పసుపును కొన్నింటితో కలిపి వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అల్లంటీలో పసుపు కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

పచ్చి పనుపుతో పాటూ నల్ల మిరియాలను పాలలో ఉడకబెట్టి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

పచ్చి పసుపును పాలు, అరటింపడుతో కలిపి తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 

కూరగాయల సూప్‌లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరగడంతో పాటూ వాపు తగ్గుతుంది. 

పచ్చి పసుపు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

పచ్చి పసుపు ముక్కలు, ఆవాల నూనె, సుగంధ్ర ద్రవ్యాలతో కూడిన ఊరగాయ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.