సీమ చింతకాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.
సీమ చింతకాయలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.
సీమ చింతకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా ఇది రక్షిస్తుంది.
సీమ చింతలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది.
సీమ చింత గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాలను అందిస్తుంది. నీరసం తగ్గిస్తుంది
ఈ కాయలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలు సైతం ధృడంగా ఉంచుతుంది.
ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.
క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.
సీమ చింతకాయలను గుబ్బ కాయలు, పులిచింతకాయలు అని కూడా పిలుస్తారు.
Related Web Stories
రోజూ ఒక్క లవంగం తినండి చాలు..
నల్ల నువ్వులతో రక్తపోటు చెక్ ...
మీ ఆరోగ్యం ఎలా ఉందో గోళ్లు చూసే చెప్పేయెుచ్చు..
చలికాలంలో కాకరకాయ తింటే ఇన్ని లాభాలా