కిడ్నీలో రాళ్లు కరగాలంటే.. వీటిని తింటే చాలు!

సరైన ఆహారం తినకపోవడం, నీళ్లు తాగకపోవడం వంటి కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు వస్తుంటాయి. ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యని తగ్గించుకోవచ్చు.

పాలకూర: ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చేయడంలో సహాయపడతాయి.

క్యాప్సికమ్: వీటిల్లో విటమిన్ ఏ, సీలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో తోడ్పడుతాయి.

దోసకాయ: వీటిలో నీటి శాతం ఎక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, మూత్రవిసర్జనని పెంచుతుంది. పలితంగా కిడ్నీల్లో ఉండే రాళ్లు తొలగిపోతాయి.

ముల్లంగి: వీటిల్లో పొటాషియం తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ ముల్లంగి కిడ్నీలకకు ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వాము ఆకులు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల బ్యాలెన్స్‌ని కాపాడి.. కిడ్నీల్లోని రాళ్ళ సమస్యని తగ్గిస్తుంది.

కాలే: ఇందులో కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఈ కాలేను కూరగాయల్లో కలిపి తింటే.. కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.