అర్ధరాత్రి వరకూ మేల్కొంటే..  మీ శరీరంలో జరిగే మార్పులివే.. 

అర్ధరాత్రి వరకూ మేల్కొంటే.. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమితో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

సరిగా నిద్రపోకపోతే ఊబకాయం సమస్య తలెత్తుతుంది.

అర్ధరాత్రి వరకూ మేల్కోవడం వల్ల జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.

సరిగా నిద్రలేకపోతే మానసిక సమస్యలు తలెత్తడంతో పాటూ క్రమంగా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది.

రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల వరకూ నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.