బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తినండి

క్వినోవా. దక్షిణ అమెరికాలోని ఫిట్‌నెస్ ఔత్సాహికులలో ఇది ప్రజాదరణ పొందింది. బియ్యం కంటే అధిక ప్రోటీన్లు కలిగి ఉంటాయి.

విరిగిన గోధుమలు ఆహారంగా తీసుకోచ్చు. దీనిని డాలియా అంటారు. 

బార్లీ. దీనిలో బియ్యం కంటే అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. విటమిన్ బి, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సైతం ఇందులో పుష్కలంగా ఉంటాయి.

కాలీఫ్లవర్ రైస్. ఇది శరీరానికి తక్కువ కేలరీలు అందిస్తుంది. రోజువారి ఆహారంలో దీనిని చేర్చుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్. శెనగలు, రాజ్‌మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. 

కొవ్వు తీసిన పాలు తాగాలి. కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు ఆహారంలో తీసుకోవాలి.