అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..!

అండాశయ క్యాన్సర్ ఇప్పట్లో ఎక్కువగా వింటున్న వ్యాధి. ఇది శరీరంలో పెరుగుతున్నదని తెలిపే సంకేతాలు చాలా రకాలుగా ఉంటాయి.

పెద్దగా తినకపోయినా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పొత్తికడుపులో ఉబ్బరం అనిపిస్తుంది.

పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. అసౌకర్యంగా ఉండటం, నొప్పి వచ్చి పోతూ ఉండటం వంటివి ఉంటాయి.

తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్రం వస్తున్నట్టు అనుమానం ఉంటుంది.

మలబద్దకం, పేగు సమస్యలు ఉంటాయి.

బుుతుచక్రంలో మార్పులు, పీరియడ్స్, ఎక్కువ రక్తస్రావం, మోనోపాజ్ తర్వాత రక్తస్రావం ఉంటుంది.

అలసట, నిద్ర వచ్చినట్టుగా అనిపించడం ఉంటుంది. 

విపరీతంగా బరువు తగ్గడం వంటివి అండాశయ క్యాన్సర్‌కు ప్రధాన సంకేతాలు.