30రోజులు వరుసగా ఖర్జూరాన్ని తింటే శరీరంలో కలిగే మార్పులివే..!

ఖర్జూరం ఎక్కువ ఆదరణ పొందిన డ్రై ఫ్రూట్స్ లో ప్రథమ స్థానంలో ఉంటుంది.

30 రోజులు క్రమం తప్పకుండా  ఖర్జూరాన్ని  తింటే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.

ఖర్జూరంలో పోషకాలు మెరుగ్గా ఉంటాయి.  ఇవి శరీరంలో శక్తిని పెంచుతాయి. , గుండె,  మెదడు కు మేలు చేస్తాయి.

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

రోజూ ఖర్జూరాన్ని తింటూంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.

ఖర్జూరంలో సహజమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మలబద్దకం ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.

కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఖర్జూరం తింటే ఎముకలు బలపడతాయి.

ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది.  ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి,  రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.