మీ శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువైతే.. అసలేం జరుగుతుంది..!

కొలస్ట్రాల్ శాతం పెరగడం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. 35 ఏళ్లు దాటిన వారందరూ ఏడాదికి ఒకసారైనా కొలస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. 

రక్తనాళాల్లో కొలస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పు విపరీతంగా పెరుగుతుంది. 

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కొలస్ట్రాల్‌తో నిండిపోతే గుండెపోటు వచ్చే ముప్పు తీవ్రమవుతుంది.

వ్యాయామం చేసే సమయంలో, ఏమాత్రం నడిచినా మీరు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతుంటే మీ రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందని అనుమానించాల్సిందే. 

మోకాళ్లు, మోచేతులు, చేతులు, కను రెప్పలపై పసుపు రంగు మొటిమల వంటివి కనిపించడం కూడా అధిక కొలస్ట్రాల్‌కు సంకేతం. మీ చర్మం కింద కొవ్వు కణాలు నిల్వ ఉండడమే దానికి కారణం. 

అధిక కొలస్ట్రాల్ కలిగిన వ్యక్తుల కాళ్లు తిమ్మిరి ఎక్కినట్టు ఉంటాయి. పాదాలకు సరిగ్గా రక్తప్రసరణ జరగకపోవడమే అందుకు కారణం. 

శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మీ రక్తపోటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకూ సరఫరా చేసేందుకు మీ గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. 

గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంటే మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోండి

రాత్రి నిద్రవేళల్లో అసౌకర్యంగా అనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం కూడా కొవ్వు ఎక్కువ పేరుకుపోయింది అనేందుకు సంకేతాలే. గుండెకు ఆక్సిజన్ తగినంత అందకపోవడం దీనికి కారణం.