మార్భర్గ్ వైరస్.. కరోనా, మంకీ పాక్స్ కంటే ఇదెంత డేంజరంటే..!

కరోనా ప్రజలలో పుట్టించిన భయం,  ఇది చేకూర్చిన నష్టం అంతా ఇంతా కాదు.

కరోనా తరువాత మంకీ పాక్స్ ప్రజలలో  కొత్త భయాన్ని సృష్టించింది.

ఇప్పడు మార్భర్గ్ వైరస్ ప్రాణాలను బలిగొనడానికి సిద్దమైంది.  ఈ వైరస్ కరోనా, మంకీ పాక్స్ కంటే ప్రమాదం అని చెబుతుండటం ప్రజలను కలవరపెడుతోంది.

మార్భర్గ్ వైరస్ ఇన్పెక్షన్ కారణంగా మరణాల రేటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

తూర్పు-మధ్య ఆఫ్రికా దేశం రువాండాలో మార్భర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోందట.

మార్భర్గ్ వైరస్ ఎంత డేంజర్ అంటే.. 100 మందికి ఈ వైరస్ సోకితే అందులో 88 నుండి 90 మంది మరణించే అవకాశాలు ఉన్నాయట.

మార్భర్గ్ వైరస్ కొత్తదేం కాదని, ఇది ఎబోలా వైరస్ కు సంబంధించినదని అంటున్నారు.

మార్బర్గ్ వైరస్ సోకితే అధిక జ్వరం, రక్తస్రావం, తలనొప్పి,  కండరాల నొప్పి వంటి సమస్యలు ఉంటాయి.