నీళ్లు తాగడానికి ప్రత్యేక టైమ్ ఉంటుందని మీకు తెలుసా..?

 నీళ్లు.. శరీర పనితీరు సక్రమంగా జరగాలంటే ఎంతో అవసరం.

నిద్రలేవగానే పళ్లు తోముకున్న తర్వాత గ్లాస్ నీరు తాగితే మంచిది. దీంతో శరీరంలోని విషపదార్థాలు బయటికిపోతాయి.

వ్యాయామం చేసే ముందు.. ఆ తర్వాత నీరు బాగా తీసుకోవాలి.

మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నీరు తీసుకుంటే జీర్ణక్రియకు మంచిది.

భోజనం తినే ముందు సరిపడా నీళ్లు తాగాలి. తినేటప్పుడు మధ్య మధ్యలో తాగినా ఇబ్బందేమీ లేదు.

పడుకునే ముందు ఒక గ్లాస్ నీరు తాగాలి. దీంతో రాత్రంతా డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుంది.

నిలబడి.. కూర్చుని నీళ్లు తాగినా పర్లేదు కానీ.. పడుకుని మాత్రం తాగకూడదు.

రోజు మొత్తమ్మీద 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని చెబుతున్న వైద్యులు, నిపుణులు.