ప్రపంచంలో అనేక మందిని కాటేస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడంతో డయాబెటిస్ పలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.

టైప్‌ 1, టైప్ 2 డయాబెటిస్ లాగా టైప్ 1.5 డయాబెటిస్ కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

శాస్త్రపరిభాషలో దీన్ని లేటెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు.

టైప్ 1, టైప్ 2 రకాల రోగ లక్షణాలు టైప్ 1.5 డయాబెటిస్‌లో కనిపిస్తాయి.

రోగనిరోధక శక్తి పాంక్రియాటిక్ గ్రంధిపై దాడి చేస్తే ఈ సమస్య వస్తుంది.

టైప్-1తో పోలిస్తే టైప్ 1.5 వ్యాధి చాలా మెల్లగా ముదురుతుంది.

టైప్ 1.5 వ్యాది బారినపడ్డ వారు ఐదేళ్ల లోపే ఇన్సులీన్‌ వాడకం మొదలు పెట్టాల్సి వస్తుంది.

30 ఏళ్ల దాటిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది.