వర్షాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి..!

వాతావరణ పీడనంలో హెచ్చుతగ్గుల కారణంగా ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు.

ఈ సమయంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

అవిసెలు, వాల్ నట్స్, చియా గింజలు, సోయా బీన్స్, బ్రోకలీ వంటి ఆహారాలను ఎముకలకు శక్తిని ఇస్తాయి.

వర్షాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ళ సంబంధిత సమస్యలకు పసుపు అద్భుతంగా పనిచేస్తుంది.

ప్యాక్ చేసిన ఆహారాన్ని, ప్రాసెస్ ఫుడ్స్‌ని దూరంగా ఉంచాలి. 

అధిక చక్కెర తీసుకోవడం కూడా వానాకాలంలో తగ్గించుకోవాలి.

కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలను చేయాలి.