మూత్రం రంగులో మార్పులు శరీరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
మూత్రం సాధారణంగా నీటి రంగులో ఉంటే అది శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉన్నాయని సూచిస్తుంది. మూత్రపిండాలు బాగా పనిచేస్తున్నట్టు.
మూత్రం రంగు మరీ క్లియర్ గా అనిపిస్తే అది శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్టు.
మూత్రం లేత పసుపు రంగులో ఉంటే ఇది శరీరంలో ద్రవాలు సరిగా ప్రాసెస్ చేయబడుతున్నాయని, కిడ్నీల పనితీరు బాగుందని అర్థం.
మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే అది శరీరానికి నీరు తక్కువైందని అర్థం. మూత్రంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు మూత్రం ఇలా ముదురు పసుపులోకి మారుతుంది.
మూత్రం ఎరుపు రంగులో ఉంటే అందులో రక్తం ఉనికి ఉన్నట్టు. మూత్ర మార్గం అంటువ్యాధులు, మూత్ర పిండాల్లో రాళ్లు, తీవ్రమైన కిడ్నీ సమస్యల కారణంగా ఇది జరుగుతుంది.
మూత్రం నారింజ రంగులో ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గడం లేదా విటమిన్ సప్లిమెంట్లు, ఇతర ఆహారాలు, ఔషదాల కారణంగా ఇలా జరుగుతుంది.
మూత్రం ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటే కొన్ని రకాల మందులు, వైద్య విధానంలో ఉపయోగించే రంగుల వల్ల ఇలా జరుగుతుంది. అరుదైన వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
మూత్రం గోధుమ రంగులలో ఉంటే శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు లేదా కాలేయం, మూత్ర పిండాల సమస్యలు వచ్చినప్పుడు జరుగుతుంది.
మూత్రం దట్టమైన రంగులో ఉంటే మూత్రనాళాల ఇన్ఫెక్షన్, మూత్ర పిండాలలో రాళ్లను సూచిస్తుంది.
మూత్రంలో నురుగు కనబడితే అదనపు ప్రోటీన్ మూత్రంలో బయటకు వెళ్లిపోతున్నట్టు. కొన్నిసార్లు మూత్రపిండాల వ్యాధిని కూడా ఇది సూచిస్తుంది.