వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎండలు ముదురుతున్నాయి. మే నెలలోకి ప్రవేశించాం. ఈ నెల రోజులు బీభత్సంగా ఎండలు దంచికొడతాయి. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

వడదెబ్బ తగలకూడదంటే ఎండలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.

ఎండా కాలంలో మద్యం తాగొద్దు. రోడ్లపై విక్రయించే రంగు పానీయాలు అసలు తాగొద్దు.

ఫుట్‌పాత్‌లపై విక్రయించే ఆహారం తినొద్దు. మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.

ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

రోజూ 15 గ్లాస్‌ల నీరు తాగాలి.  పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

మిత ఆహారం తీసుకోవాలి. రెండు పూటల స్నానం చేయాలి. కాటన్‌ దుస్తులు ధరించాలి.

ఇంటి బయట నిద్రపోతే దోమతెర కట్టుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ పెట్టుకోవాలి.

ఇంట్లో కిటికీలు తెరిచి ఫ్యాన్‌వేసి గది చల్ల బడేలా చూడాలి. రోజూ మజ్జిగ తాగాలి. జ్యూస్‌, మజ్జిగ తయారు చేసుకొని ప్రతిరోజూ తాగాలి.