రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్యమైన ఆహారం మెరుగైన శక్తి స్థాయిలు అందిస్తాయి.
గుడ్లు.. గుడ్లలో అధిక ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, శక్తిని పెంచుతాయి.
వోట్మీల్.. ఫైబర్ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వోట్మీల్ మనకు చాలా శక్తిని ఇస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ని ఇస్తుంది.
బీన్స్.. బీన్స్, చికెన్, గుడ్లకు అద్బుతమైన శాకాహార ప్రత్యామ్నాయం. అలాగే అధిక ప్రోటీన్ మూలం. బీన్స్ వాటి అధిక పోషక విలువల కారణంగా రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది.
అరటిపండు.. శక్తి అందించే గొప్ప ఆహారాలలో ఒకటి. ఇది సహజమైన ఫైబర్, చక్కెరలతో కూడిన అల్పాహారం, ఇది జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తుంది.
చియా గింజలు.. చియా గింజల్లో శక్తిని పెంచే పోషకాలున్నాయి. ఇవి రోజంతా శరీరంలో శక్తి స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
చికెన్.. ఎదుగుదలకు అవసరమైన చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి.
నీరు.. ఇది నేరుగా శక్తిని అందించనప్పటికీ శరీరం శక్తి ఉత్పత్తిలో నీరు సహయపడుతుంది.
నట్స్.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బ్రెజిల్ నట్స్, వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, పెకాన్లు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు శక్తిని అందిస్తాయి.