ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగ నిర్ధారణ ఎందుకు ఆలస్యం అవుతుంది..!

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణం.

అపోహలు, చివరి దశలో రోగనిర్థారణ కావడం వంటివి వ్యాధి పెరిగేందుకు, ప్రాణాపాయం వరకూ వస్తుంది. 

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధానంగా ధూమపానం చేసేవారికి మాత్రమే వస్తుందనే అపోహ ఉంది. 

దాదాపు 50% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయనివారిలోనే కనిపిస్తాయి. ఇది తెలుసుకునే లోపు చికిత్స చేసే సమయం దాటిపోతుంది. 

దగ్గు, ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను చిన్న రుగ్మతలుగా భావిస్తూ ఉంటాం. దీనితోనే ఆలస్యం అవుతూ ఉంటుంది. 

రెండు నుండి మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉన్నవారు ప్రమాదంలో ఉన్నట్టుగా గుర్తించాలి. 

ముందస్తు రోగనిర్థారణకు HRCT థొరాక్స్ వాడకాన్ని, స్కీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెంచాలి.