పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఎందుకు  చేస్తారో తెలుసా

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనేది పెద్దల మాట.. 

పెళ్లి చేసే ముందు వధూవరులకు పసుపు రాయడం ఓ సాంప్రదాయం

పెళ్లికి రెండు రోజుల ముందు  హల్దీ వేడుకను జరుపుతారు.

హల్దీ ఫంక్షన్ కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనక లోతైన శాస్త్రీయ, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి

పసుపు.. చర్మాన్ని ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 

పసుపులో ఉండే రిలాక్షిన్ లక్షణాలు శరీరానికి విశ్రాంతి కలిగించడంలో సహాయపడుతుంది

వివాహ సమయంలో ఏర్పడే ఒత్తిడి, భయాన్ని తగ్గిస్తుంది

హల్దీ సమయంలో వధూవరులు పసుపు దుస్తులు ధరిస్తారు.. పసుపు శుద్ధి, శుభ్రం, ఆరోగ్యానికి ప్రతీక

పెళ్లిలో వధువు మెరిసేలా కనిపించేందుకు పసుపును తల నుంచి కాలి వరకు పూస్తారు.

పసుపు.. చర్మాన్ని మచ్చలు, దురద, ఇన్‌ఫెక్షన్ బారి నుంచి రక్షిస్తుంది.