ఈ దోశతో బరువు ఇట్టే తగ్గొచ్చు..  ఎలా తయారు చేయాలంటే..!

 బీట్ రూట్‍లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇది బరువు తగ్గించడానికి సరైన ఆహారంగా పనిచేస్తుంది.

 సలాడ్, సూప్‌లలో ఓట్స్, బీట్ రూట్ మసాలా దోశ చక్కని అల్పాహారంగా ఉంటుంది.

ఓట్స్ రాత్రి నీళ్ళలో పోసి నాననివ్వండి. బీట్ రూట్ ఉడకబెట్టి మెత్తగా ప్యూరీలా రుబ్బుకోవాలి. రాత్రి నానబెట్టిన ఓట్స్ కూడా మెత్తని పిండిలా రుబ్బుకోవాలి.

ఓట్స్ పిండి, బీట్ రూట్, పెరుగు, ఉప్పు, గరం మసాలా కలిపి ఉంచాలి.

ఈ మృదువైన పిండిలో కొద్దిగా నీరు చేర్చి దోశలు వేసేందుకు సిద్ధం చేసుకోవాలి.

ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు, పనీర్, అల్లం, కొత్తి మీర పైన దోశ మీద వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగి మరింత రుచిని ఇస్తాయి.

దోశను దోరగా వేగనిచ్చి, బంగారు రంగులోకి వచ్చాకా తీసుకోవడమే.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ దోశ అల్పాహారంగానే కాదు. రాత్రి డైట్లో కూడా చక్కని రుచికరమైన ఆహారంగా ఉంటుంది.