86cc83f4-7d4e-4055-aec1-b3bdc6d6fb43-mag.jpg

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఇన్ని అనర్థాలు ఉంటాయా..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల పోషకాలు అవసరం.

శరీరానికి అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం కీలకమైనది. ఇది లోపిస్తే శరీరం చాలా దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మెగ్నీషియం లోపిస్తే కండరాల తిమ్మిరి,  బలహీనత సమస్య పెరుగుతుంది.

మెగ్నీషియం లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.  ఎప్పుడూ ఒత్తిడిగా,  ఆత్రుతగా అనిపిస్తుంది.

గుండె కొట్టుకునే వేగంలో అసమానతలు మెగ్నీషియం లోపం వల్ల ఏర్పడతాయి.

అధిక రక్తపోటు ఉన్నవారిలో మెగ్నీషియం లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

ఎముకలు బలహీన పడటం,  కీళ్ల నొప్పులు,  అస్టియోపోరోసిస్ వంటి సమస్యలు మెగ్నీషియం లోపం వల్ల వస్తాయి.

రోజంతా అలసిపోయినట్టు, బలహీనంగా ఉంటే అది మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది.