ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఉదయాన్నే 5 రకాల డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది కాదు.
ఖర్డూరం.. ఖర్జూరంలో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి.
ఎండుద్రాక్ష.. ఎండుద్రాక్షలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి.
ఎండిన అంజీర్..
ఎండు అత్తిపండ్లలో సహజ చక్కెరలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది.
ఎండిన ఆప్రికాట్.. ఎండిన ఆప్రికాట్లలో సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది సెన్సిటీవ్ ఉన్న వ్యక్తులలో అలర్జీలు, జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.
ఎండిన మామిడి.. సహజ చక్కెరలు అధికంగా ఉండటం వల్ల ఎండిన మామిడి కూడా ఉదయాన్నే తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
Related Web Stories
ఉప్పు తగ్గించడం వల్ల కలిగే 5 లాభాలివే..
అరటిపండు తింటే బరువు పెరుగుతారా?
ముఖంపై అస్సలు అప్లై చేయకూడనివి ఇవే..
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ పొరపాట్లు అసలు చెయ్యొద్దు