ఈ 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..!
విత్తనాలు విటమిన్లు, పోషకాలకు పవర్ హౌస్. 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాత తీసుకోవడం వల్ల వాటిలో పోషకాల కంటెంట్ పెరుగుతుంది.
విత్తనాలను నానబెట్టి తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. శరీరం పోషకాలు గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతాయి.
చియా విత్తనాలు..చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా--3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రాత్రి సమయంలో వీటిని నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.
అవిసె గింజలు..
అవిసె గింజలు నానబెట్టడం వల్ల వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ పెరుగుతాయి. విటమిన్లు, ఖనిజాలను సులభంగా గ్రహించేలా చేస్తాయి.
నువ్వులు..
నువ్వులలో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని నానబెట్టడం వల్ల వీటి పై పొర మృదువుగా మారుతుంది. జీర్ణాశయానికి మంచిది.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలలో పెపిటాస్ లేదా మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిని నాబెట్టడం వల్ల పోషకాలు మెరుగవుతాయి.
గసగసాలు..
గసగసాలలో ఫోలేట్, థయామిన్, పాంతోతేనిక్ యాసిడ్, విటమిన్-బి మొదలైనవి ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. వీటిలో ఉండే సహజమైన చేదు రుచి తగ్గుతుంది.
మెంతులు..
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గేలా చేస్తుంది.