మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపమున్నట్టే లెక్క!
విటమిన్లు శరీరానికి చాలా అవసరం. ఇవి లోపిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ బి లోపిస్తే జుట్టు, గోర్లు సున్నితంగా మారిపోతాయి.
శరీరానికి విటమిన్-బి అందకపోతే నోటిలో, నోటి చుట్టుప్రక్కల పుండ్లు, బొబ్బలు ఏర్పడతాయి.
గాయాలు తొందరగా నయం కాకపోయినా, చిగుళ్లలో రక్తస్రావం జరుగుతున్నా విటమిన్-సి లోపం ఉందని అర్థం.
రాత్రి సమయంలో కంటిచూపు ఇబ్బందులు ఉంటే విటమిన్-ఎ లోపం ఉందని అర్థం.
ఆహారంలో జింక్, నియాసిన్ లోపిస్తే చుండ్రు, జుట్టులో పొలుసులు వంటి సమస్యలు వస్తాయి.
ఐరన్, జింక్ లోపిస్తే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది.
విటమిన్-సి తక్కువ ఉందనడానికి మరొక కారణం ముడతలు, చిన్నవయసులోనే వృద్దాప్యం.
ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటే శరీరంలో విటమిన్-డి లోపంగా గుర్తించాలి.