ఇంట్లో చీమల బెడద  పోవాలంటే ఇలా  ట్రై చేయండి..!

ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం వల్ల చీమలు, దోమలు, పురుగుల్లాంటివి  రావడం తగ్గుతాయి.

పెప్పర్‌ మింట్ నీటిని చల్లడం వల్ల కూడా  చీమలు, దోమలు ఇంట్లో కనిపించావు

ఇళ్లల్లో, ఏ పదార్థాన్ని పెట్టినా ఐదు నిమిషాల్లో చీమలు అక్కడకు చేరిపోతాయి.

పాలు, పెరుగు, పంచదార, స్వీట్లు ఇలా ఏవి కనిపించినా సరే నిమిషాల్లో చీమలు వరుసలు కట్టేస్తుంటాయి.

చీమల వల్ల వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

వేప నూనెను, ఇంట్లో  కాకుండా, మొక్కలపై కూడా  స్ప్రే చేయాలి ఆ వాసనకు చీమలు తగ్గుతాయి.

మిరియాల పొడి,ఎర్ర కారం ఈ రెండింటిలో ఘాటైన వాసన ఉంటుంది. వంటగది మూలల్లో చల్లడం వల్ల బాగా పనిచేస్తుంది.

యూకలిప్టస్‌ ఆయిల్‌,లెమన్‌,  కలిపి చిలకరించినా చీమలు తగ్గుతాయి

చీమలు ఉన్న ప్రదేశంలో ఉప్పును చల్లడం వల్ల కూడా చీమల బెడదను తగ్గిస్తుంది

దాల్చిన చెక్క,  లవంగం కలిపి చీమలు వచ్చే చోట ఉంచాలి.