ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!
కొన్నిసార్లు ఫుడ్ కాంబినేషన్ వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణసమస్యలు, పోషక విలువల శోషణ మొదలైన సమస్యలు వస్తాయి. అలాంటి కాంబినేషన్లు ఇవి.
సిట్రస్ పండ్లతో పాలు, పాల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది జీర్ణసమస్యలు, పోషక లోపాలకు దారితీస్తుంది.
పాస్తా, బ్రెడ్ వంటి పిండి పదార్థాలను ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలతో కలిపితే జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి దారి తీస్తుంది.
పాలు, చేపలు కలిపి వండటం చాలా ప్రమాదం. జీర్ణ ఎంజైమ్ లు లోపించి, జీర్ణసమస్యలు రావడానికి ఇది కారణమవుతుంది.
అరటిపండ్లు, పాలు చాలామందికి ఇష్టం. కానీ శరీరంలో టాక్సిన్లు ఉత్పత్తి కావడానికి, జీర్ణక్రియ ఇబ్బందికి ఇది దారి తీస్తుంది.
కెఫిన్ పానీయాలు, షుగర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలకు అంతరాయం కలుగుతుంది.
ఉల్లిపాయ పెరుగు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలకు, ఉబ్బరానికి, గ్యాస్ ఉత్పత్తికి దారి తీస్తుంది. అజీర్ణం ఏర్పడుతుంది.
Related Web Stories
తినే ముందు నానబెట్టాల్సిన ఆహారపదార్థాలు ఇవే..!
ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!
ప్రపంచంలో భారతీయులు లేని ప్రాంతాలు ఇవే!
భారత్లో ప్రజలు మాట్లాడే అత్యంత పురాతన భాషలు!